Sri Tripura Tandaveshwara swamy Temple, Tadepalli, Guntur district

శ్రీ త్రిపుర తాండవేశ్వర స్వామి ఆలయం, తాడేపల్లి అడుగడుగున గుడి ఉన్నది అని కవి అన్నట్లు ప్రతి ఊరిలో ఒకటి రెండు ఆలయాలు మన రాష్ట్రంలో కనిపిస్తాయి. వాటిలో అధికశాతం పురాతనమైనవే కావడం చెప్పుకోదగిన అంశం. కృష్ణానదీ తీరంలో ముఖ్యంగా నేటి కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో కనిపించే పురాతన ఆలయాలలో అధిక శాతం వేంగి చాళుక్యుల కాలంలో నిర్మించబడినవి అని తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనంద గోత్రీకులు, కాకతీయులు, రెడ్డి రాజులు, రాష్ట్ర కూటులు, విష్ణుకుండినులు, స్థానిక పాలకులు, విజయనగర రాజులు, గజపతి రాజులు మరియు చివరగా అమరావతిని రాజధానిగా చేసుకొని పాలించిన శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆలయాల పునః నిర్మాణం, నూతన మండపాలు నిర్మించి, అభివృద్ధి చేసి, ఆలయ నిర్వహణ నిమిత్తం భూరి విరాళాలు మరియు భూమి సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది. చాళుక్యులు కన్నడ ప్రాంతానికి చెందిన వేరు నేటి "బాదామి" న రాజధానిగా చేసుకొని ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి ఏడవ శతాబ్ద కాలంలో పరిపాలించారు. వంద సంవత్సరాల కాలంలో వీరు భారత దేశ దక్షిణ ప్రాంతాన్ని మరియు మధ్య భారతంలో కొంత ప్రాంతాన్ని పాల...