13, సెప్టెంబర్ 2015, ఆదివారం

Papanasanam, Tirumala

                                      పాపనాశనం, తిరుమల 

సర్వ పాపాలను తొలగించే పావన తీర్ధం తిరుమల లోని "పాపనాశన తీర్ధం". 

ఈ తీర్ధం గురించిన ప్రస్తాపన స్కాంద పురాణంలో ఉన్నది. 

గతంలో ఈ నీటినే స్వామి వారి సేవలో ఉపయోగించేవారు. 

ప్రస్తుతం ఆకాశ గంగ జలాలను వినియోగిస్తున్నారు. 









పూర్వం అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రిందటి వరకూ ఇదొక కారడవి.

సూర్య కిరణాలు కూడా ప్రవేశించలేని దట్టమైన చెట్లతో కూడిన అడవి. నాకు బాగా గుర్తు.

కొందరు ఆవి పుత్రులు రుద్రాక్షలు, పూసల దండలు, వన మూలికలు అమ్ముతుండే వారు.

ఏ రకమైన సౌకర్యాలు లభించేవి కావు.

కాల గమనంలో సప్తగిరుల మీద నీటి అవసరాలు పెరిగి పోవడంతో అన్నిటికన్నాపెద్దది ఐన ఈ జలపాతాల పైన ఆనకట్ట నిర్మించారు.






పూర్వం సహజం గా కొండల మీద నుంచి జాలువారే నీటి ప్రవాహాన్ని ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన పంపుల ద్వారా

విడుస్తున్నారు.

భక్తులు ఆ ధారల క్రిందనే స్నానమాచారిస్తున్నారు.

శ్రీ గంగా దేవి మరియు శ్రీ హనుమంతుని ఆలయాలను నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అద్వర్యంలో

నియుక్తులైన బ్రాహ్మణులు శాస్త్ర ప్రకారం పూజలను జరిపిస్తున్నారు.
బస్సులు, అనేక ప్రెవేటు వాహనాలు లభిస్తాయి.









ఈ ఆనకట్ట దాటి అడవిలో ముందుకు వెళితే పసుపు ధార తీర్ధం, కుమార తీర్ధం, సనకసనందన తీర్ధం, శ్రీ రామ కృష్ణ

తీర్ధం, తుంబుర తీర్ధం ఉంటాయి.

కొన్ని ప్రత్యేక పర్వదినాలలో భక్తులను ఎ తీర్థాలను సందర్శించడానికి అనుమతిస్తారు.

ఒక అద్భుతమైన అనుభవం పొందవచ్చునని వెళ్ళిన మిత్రులొకరు తెలిపారు.
దైవానుగ్రహం లభిస్తే తొందరలో ఆ తీర్దాల వివరాలను ఈ బ్లాగ్ లో మీ అందరితో పంచుకొంటానని

తెలియజేస్తున్నాను.








ప్రశాంత ప్రకృతి తో మమేకం కావాలంటే తప్పక పాపనాశనం దర్శించాల్సినదే !!






ఓం నమో వేంకటేశాయ !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...