Tuesday, May 26, 2015

Sri Paidi Thalli Ammavari Temple, Vizianagaram

                         శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, విజియనగరం  

పూసపాటి రాజవంశీకుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు.
అమ్మవారి గురించి ఇదు మిద్దంగా సంపూర్ణ చరిత్ర లభించడం లేదు.
కొందరు ఆమె విజియనగర గ్రామా దేవత అని ఇంకొందరు ఆమె రాజ వంశ ఆడబడుచని అంటారు. 


విజియ నగర వాసులు తమను కాపాడే దేవతగా భావించే పైదితల్లికి చదును గుడి మరియు వనం గుడి అని రండు ఆలయాలున్నాయి.
చదుని గుడి ఊళ్ళోని మూడు లాంతర్ల జంక్షన్ లో ఉండగా వనం గుడి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది.

నిత్య పూజలతో భక్తుల సందర్శనంతో రెండు నిత్య కలకలాడుతుంటాయి.
అన్ని పర్వదినాలలో విశేష పూజలు అలంకారాలు జరుపుతారు.

దసరాలలో నవరాత్రులను ఘనంగా జరుపుతారు.
ఈ దసరా ఉత్సవాల తరువాత వచ్చే తోలి మంగళవారం విజియ నగరం విశేష శోభను సంతరించుకొంటుంది.

అదే సిరి మానోత్సవ సంబర శోభ.
లక్షలాదిగా భక్తులు ఉత్తర ఆంద్ర జిల్లాల నుండి మరియు ఒడిష రాష్ట్రాల నుండి తరలి వస్తారు.


ప్రత్యేక విధానంలో సిరి మానును ఈ ఉత్సవ నిమిత్తం సేకరిస్తారు.తప్పక చూడవలసిన ఉత్సవం ఇది. 

Wednesday, May 20, 2015

Irumpanam Makaliyam Sree Rama Swamy Temple

                            శ్రీ రామ స్వామి ఆలయం, ఇరుంపాణం 


భారతీయులకు శ్రీ రామ చంద్ర మూర్తి ఆరాధ్య దైవమే కాదు మార్గదర్శి, ఆమోదప్రదమైన ప్రభువు, ఆదర్శ మూర్తి.
రాముని ఆలయం లేని ఊరు భారత దేశంలో కనపడదు.
అలాంటి ఆలయాలలో కొన్ని సమస్త ప్రజానీకానికి తెలిసి ప్రముఖ స్థానాన్ని పొందుతున్నాయి.
మరికొన్ని విశేష పురాణ నేపద్యం ఉన్నా స్థానికంగా కూడా అంత గుర్తింపు పొందనివి.
అలాంటి వాటిల్లో కేరళ రాష్ట్రం లోని  ఇరుంపాణం మకలియం శ్రీ రామ స్వామి ఆలయం ఒకటి.మిగిలిన రాష్ట్రాల సీతారాముని ఆలయాలకు కేరళ రాష్ట్రం లోని వాటికీ ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే ఇక్కడ గర్భాలయంలో రాముడు ఒక్కరే ఉంటారు. పూజలందు కొంటారు. 

మకలియంలో జగదభిరాముడు కొలువు తీరడానికి వెనుక త్రేతా యుగం నాటి సంఘటనలే కారణం అని క్షేత్ర గాధ తెలుపుతోంది. 
లంకేశ్వరుని ముద్దుల చెల్లెలు శూర్పణఖ అరణ్య వాసం చేస్తున్న మనోభిరాముని చూసి వాంచించడం, సోదరుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోయడం అందరికీ తెలిసిన కధే !

అవమానంతో శూర్పణఖ రోదిస్తూ తొలుత అదే అరణ్యంలో ఉన్న సోదరులు ఖర దూషనాదుల వద్దకు వెళ్ళింది.
సోదరికి జరిగిన పరాభవానికి ఆగ్రహానికి లోనైన వారు తమ బలగాలను తీసుకొని కోదండ పాణి మీదకు దండయాత్ర కు తరలి వెళ్ళారు.

లక్ష్మణుని సంరక్షణలో ఉంచి తామొక్కరే వేలాది మంది రాక్షసులను సంహరించారు.
అదే విధంగా వారి నాయకులైన ఖర దూషణ మరియు వారి సన్నిహితుడైన త్రిశరుని అంతం చేసారు అసురసంహార మూర్తి.
అకంనుడు అనే సహచరుడు తప్పించుకొని పారిపోయాడు.
వానికి ఆ సమయంలో సుందర శాంత స్వరూపులైన దాశరది రుద్ర తాండవ రూపంలో పద్దెనిమిది హస్తాలతో రాక్షస సంహారం చేసిన విధానం తలపునకు వచ్చినది. 
ఆ భీకర యుద్ధం జరిగిన స్థలం ఇదేనని చెబుతారు.
(ఇదే సంఘటన జరిగిన స్థలంగా ఛత్తీస్ ఘర్ రాష్ట్రం "ఖరోద్" అనే గ్రామాన్ని కూడా అక్కడ పేర్కొంటారు. ఖర దూషణనుల పేర్ల మీద "ఖరోద్" అన్న పేరు వచ్చినది అంటారు)

ఆ భావనతో ఇక్కడ స్వామి ఉగ్ర రూపులై ఉంటారని అందుకే నిరంతరం చందనంతో శాంత రూప అలంకరణ చేస్తారు అని చెబుతారు . రుద్ర రూపం దాల్చడం వలన సదాశివునికి మాదిరి నుదిటిన మూడో నేత్రం ఉందని భావిస్తారు. 
హరిహర రూపంగా పేర్కొనవచ్చును. 
మూల విరాట్టు ఐదున్నర అడుగుల ఎత్తుతో ధనుర్భాణాలు ధరించి చక్కని చందన పుష్ప అలంకరణతో స్థానక భంగిమలో నాయన మనోహరంగా దర్శనమిస్తారు. 
సువిశాల ప్రాంగణంలో పడమర దిశగా ఉంటుందీ ఆలయం. 
తూర్పున కూడా ద్వారం అక్కడ ఒక రాతి దీప స్థంభం ఉంచారు. ఉపాలయాలలొ శ్రీ గణపతి మరియు శ్రీ ధర్మ శాస్త కొలువై ఉంటారు.
ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు మరియు ఆంజనేయుడు స్వామి సేవకు సిద్దంగా ఉంటారు.
సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రిందట చేర వంశ రాజులు తొట్ట తోలి ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసన ఆధారాలు తెలుపుతున్నాయి.
కానీ రెండువందల సంవత్సరాల క్రిందట జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో ఆలయం పూర్తిగా కాలిపోయింది.
నాటి కొచ్చిన్ రాజులు ఆలయాన్ని యధాతధంగా పునః నిర్మించారు.
నిత్యం మూడు పూజలు , అభిషేకాలు , అలంకరణలు నివేదనలు శ్రీ రామ స్వామికి నియమంగా జరుపుతారు.  

గణేష చతుర్ధి, హనుమజ్జయంతి, ఓనం, విషు లతో పాటు శ్రీ రామ నవమి వైభవంగా నిర్వహిస్తారు. 
జన్మ రీత్యా, జాతక రీత్యా ఏర్పడే గ్రహ దోషాలను హరించే వానిగా శ్రీ రామ స్వామి ప్రసిద్ది. ఈ విశిష్ట క్షేత్రం కొచ్చిన్ నగర శివారు ప్రాంతమైన "త్రిపునిత్తూర"కు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది .
ఎర్నాకుళం జంక్షన్ లేదా టౌన్ రైల్వే స్టేషన్లల నుండి బస్సులు  త్రిపునిత్తూరకు లభిస్తాయి.
త్రిపునిత్తూరలోని శ్రీ పూర్ణత్రేయేశ స్వామి ఆలయం తప్పక చూడదగ్గది.
ఈ బ్లాగ్ లో ఆ ఆలయ వివరాలు ఉన్నాయి.

జై శ్రీ రామ్ !!!Monday, May 18, 2015

Sri Pardhasathi Swamy Temple, Guruvayur

                         శ్రీ పార్ధ సారధి ఆలయం, గురువాయూరు 

గురువాయుర్ కేరళ రాష్ట్రం లో అధిక సంఖ్యలో భక్త జనులను ఆకర్షించే దివ్య క్షేత్రం.
శ్రీ గురువాయురప్పన్ ( శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని బృహస్పతి (దేవతల గురువు), వాయుదేవుడు కలిసి ప్రతిష్టించారని ఆ కారణంగానే "గురువాయుర్ " అన్న పేరోచ్చినదంటారు.
ఇక్కడి స్వామి ఆలయం క్రీస్తు పూర్వం నిర్మించబడినది అని అంటారు.
ఈ క్షేత్రం ఎన్న ప్రత్యేకతలకు ఆలయాలకు ప్రసిద్ది.
అలాంటి ఆలయాలలో శ్రీ  పార్ధ సారధి ఆలయం ఒకటి. 
గురువాయుర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఈ ఆలయ పౌరాణిక గాధ ద్వాపర యుగం నాటిది.
పాండవులకు బంధువు, మార్గదర్శి, సహాయకారి, దైవం అన్నీ శ్రీ కృష్ణుడే !!
కష్ట సుఖాలలో తమ ఆరాధ్య దైవాన్ని మానస వాచా కర్మనా తలుచుకొంటూనే ఉండేవారు.
పాండవుల తల్లి కుంతీ దేవి తన బిడ్డల క్షేమం కోరి వాసు దేవుని విగ్రహాన్ని ప్రతి నిత్యం పూజించేది.
ఆమె నాడు అర్చించిన విగ్రహమే ఈ ఆలయంలో ఉన్నది.
ఈ విషయాన్ని నారద మహర్షి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులకు తెలిపారు.
అలా త్రిలోక చారుని మార్గదర్శకత్వంలో ఆది శంకరులు శ్రీ పార్ధ సారధి మూర్తిని సేకరించి ఇక్కడ ప్రతిష్టించారు.

ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఎన్నో రాజ వంశాలు కైంకర్యాలు సంపర్పించు కొన్నాయి.
ఆలయాభివ్రుద్దికి కృషి చేసాయి.
కానీ  పద్దెనిమిదో శతాబ్దంలో మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ కేరళ ప్రాంతం మీద తన ఆధిపత్యాన్నిపూర్తి స్థాయిలో చెలాయించాడు.
 కేరళ ప్రాంతంలో  అనేక హిందూ ఆలయాలు విధ్యంసానికి గురైనాయి.
వాటిల్లో ఈ ఆలయం కూడా ఒకటి.
తిరిగి ఇరవై శతాబ్దంలో స్థానికుల మరియు గురువాయూరు దేవస్వం వారు పూనుకొని పునః నిర్మించారు.
ప్రస్తుతం అన్ని ఆలయాలలో మాదిరి నిత్య పూజలు ఉత్సవాలు జరుగుతున్న ఈ ఆలయం లోని మూలవిరాట్టు చతుర్భుజ శ్రీ పార్ధ సారథి అత్యంత సుందర అలంకరణతో నయన మనోహరంగా దర్శనమిస్తారు.

ప్రతి నిత్యం మూడు పూజలు, అభిషేకాలు, అలంకరణలు స్వామికి నిర్వహిస్తారు.
కృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, విషు, ఓనం లాంటి పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి.
అష్టమి మరియు నవమి రోజులలో ప్రత్యేక అలంకరణ జరుపుతారు.
ఆలయ ప్రతిష్టా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

గురువాయుర్ పట్టణంలో ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఈ ఆలయానికి కాలినడకన సులభంగా చేరుకోవచ్చును.

కృష్ణం వందే జగద్గురుం !!!!

Airavateswarar Temple, Darasuram

              శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం, ధారసురం   ఆలయాల రాష్ట్రం తమిళనాడులో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. ముఖ్యంగా చోళ ర...