6, డిసెంబర్ 2014, శనివారం

Sri Krishna Dharmaraja Devasthanam, Moolapeta, Nellore

                            శ్రీ కృష్ణ ధర్మరాజ దేవస్థానం, నెల్లూరు 

భారత దేశం  భిన్న మతాల, సంస్కృతుల, విశ్వాసాల నిలయం. 
ముక్కోటి దేవతలకే కాక పురాణ పాత్రలను కూడా వివిధ కారణాలతో నమ్మకాలతో అర్చించడం భారతావనిలో కనపడుతుంది. 
ఉత్తర దక్షిణ భాగాలలో భీష్మ,దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, అశ్వద్దామ, హిడింబి, ఘటోత్కచ లాంటి పాత్రల ఆలయాలున్నాయి అనేక ప్రాంతాలలో. 
మన రాష్ట్రంలోని పెన్నా నదికి ఆవల ఉన్న నెల్లూరు, చిత్తూరు సహా తమిళ నాడు లోని అనేక ప్రదేశాలలో కురుక్షేత్ర విజేతలు అయిన పాండు నందనులు, వారి సతి ద్రౌపది దేవి ఆలయాలు చాలా ఉన్నాయి. 
కొన్ని చోట్ల వీరికి గురువు, మార్గదర్శి, బంధువు, దైవం అయిన శ్రీ కృష్ణుడు కూడా ఉంటారు. 
అలాంటి ఒక అరుదైన ఆలయం నెల్లూరు పట్టణం లోని మూల పేటలో కొన్ని శతాబ్దాలుగా ఉన్నది. 



తమిళనాడులో ఆత్రేయస గోత్రీకులు శ్రీ ద్రౌపది అమ్మన్ ను కుల దైవంగా భావిస్తారు. 
మరి కొన్ని ప్రదేశాలలో (తమిళ నాడు లోనే) గ్రామదేవతగా ఆమె పూజలందుకొంటారు. 
భక్తులు ఈమెను దుర్గ, కాళి, పార్వతి ప్రతిరూపంగా ఆరాధిస్తారు. 
అనేకానేక జానపద గాధలు ద్రౌపది దేవితో ముడిపడి ఉన్నవి తమిళనాడులో బహుళ ప్రచారంలో ఉన్నాయి. 
ఈ సాంప్రదాయానికి మూలకారణం పూర్తిగా తెలియరావడం లేదు. 

నెల్లూరు లోని శ్రీ కృష్ణ ధర్మరాజ స్వామి ఆలయం "కాంభోజ రాజు" కాలం లోనిదిగా చెబుతారు. 
ఆ రాజు ఈ ప్రాంతాన్ని పాలించిన రోజులలో పాడు పడిన చెరువుకు పూడిక తీయించే సమయంలో బయల్పడిన విగ్రహాలకు ఆలయం కట్టించారని అంటారు. 
తదనంతర కాలంలో అనేక రాజ వంశాల వారు ఆలయాభివ్రుద్దికి తమ వంతు కృషి చేసారు.  
గత రెండు దశాబ్దాలుగా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. 
ఆలయాని పునరుర్ధరించడం, నూతన నిర్మాణాలు నిర్మించడం జరిగాయి. 
ప్రతి నిత్యం మూడు పూజలు జరుపుతారు. 
మూలపేటలో ప్రముఖ శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో ఉంటుంది. 
వర్ణభరిత మండపాలు, శిల్పాలతో నిండిన ఆలయం సందర్శకులను ప్రధమ వీక్షనం లోనే ఆకర్షిస్తుంది. 
ఆలయానికి ఎదురుగా పుష్కరాని ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తాయి. 
అక్కడే చిన్న మందిరంలో శ్రీ వేణు గోపాల స్వామి మూర్తిని ఉంచారు. 
అనివెట్టి మండపంలో దశావతార రూపాలు, ధ్వజస్తంభం, బలి పీఠం ఉంటాయి. 
గర్భాలం లోనికి వెళ్ళే మార్గం పైన మూల విరాత్తుల రూపాలుంటాయి. 
ద్వారానికి రెండు పక్కలా గణనాధుడు కొలువై ఉంటారు. 
లోపల సింహాసనం పైన కూర్చున్న శ్రీ ధర్మ రాజు, ఆయనకు కుడి పక్కన శ్రీ కృష్ణ భగవానుడు కూడా ఉపస్థిత భంగిమలో, ఎడమ పక్కన స్థానక భంగిమలో శ్రీ ద్రౌపది దేవి దర్శనమిస్తారు. 
అర్ధ మండపంలో పంచ పాండవ, శ్రీ కృష్ణ, శ్రీ ద్రౌపది దేవి సత్య భామ, రుక్మిణీ దేవి ఉత్స విగ్రహాలు ఉంటాయి. 
అధిక శాతం పూజలు, అర్చనలు శ్రీ ద్రౌపది దేవి ఉత్సవ మూర్తికి జరుగుతాయి. 




















పరంగాన నైరుతిలో పట్టణం లోనే పెద్దదైన పుట్ట ఉంటుంది. నాగుల చవితి నాడు వేలాదిగా భక్తులు పాలు పోయడానికి తరలి వస్తారు.
పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడానికి, చెవులు కుట్టించడానికి ఆది వారాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తుంటారు.
ఎన్నో నాగ ప్రతిష్టలు ఉంటాయిక్కడ.
సంతానం లేని దంపతులు, పెళ్లి కానీ యువతీ యువకులు నాగా దోషం తొలగి పోవడానికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తుంటారు.








పక్కనే దుర్గా దేవి, ఆ పక్కన మునీశ్వర సమేత సప్త మాత్రుకల ఉపాలయాలుంటాయి.













అన్ని పర్వ దినాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. 
సంవత్సరానికి ఒక సారి జరిగే ఆలయ ఉత్సవాలలొ వేలాదిగా భక్తులు చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుండి తరలి వస్తారు.  

















                              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...